స్టఫ్డ్ కాటేజ్ చీజ్ కావల్సిన పదార్థాలు:
పన్నీర్ : 15 గ్రా.
క్యారెట్ : 1గ్రా.
బీన్స్ : 1 గ్రా
కాలీఫ్లవర్: 1గ్రా.
రెడ్ అండ్ యెల్లో
క్యాప్సికం : 2గ్రా
ఆలివ్ ఆయిల్ : 5మి.లీ.
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, రెడ్ అండ్ యెల్లో క్యాప్సికంను చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించాలి. అంటే.. హాఫ్ బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు పన్నీర్‌ని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. రెండు పన్నీర్ ముక్కల మధ్యలో ఈ ఉడికించిన కూరగాయ ముక్కలను ఉంచాలి. కడాయిలో నూనె పోసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. పై నుంచి టమాటా సాస్ వేసుకుంటే ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: